భారత్, అజర్బైజాన్ దేశాలు సాంస్కృతిక సంబంధాల బలోపేతం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో అజర్బైజాన్ సాంస్కృతిక శాఖ మంత్రి ఆదిల్ కరీమ్లీ, భారత రాయబారి అభయ్ కుమార్తో సమావేశమయ్యారు. కళలు, సాహిత్యం, సినిమా, సంగీతం, సంప్రదాయాల రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.
భారత్, అజర్బైజాన్ దేశాలు తమ మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో అజర్బైజాన్ సాంస్కృతిక శాఖ మంత్రి ఆదిల్ కరీమ్లీ, భారత రాయబారి అభయ్ కుమార్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య కళలు, సాహిత్యం, సినిమా, సంగీతం, సంప్రదాయాలు వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పరస్పర మార్పిడి ప్రాజెక్టుల ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతి, సినిమాలు, సంప్రదాయాలకు అజర్బైజాన్లో మంచి గుర్తింపు కల్పించేందుకు సహకారం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉమ్మడి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని సమావేశంలో చర్చించారు.


