కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా తాటహళ్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య పద్మను (30) ఆమె భర్త చంద్ర (34) గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పద్మ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా తాటహళ్లి గ్రామంలో పద్మ (30) అనే మహిళను ఆమె భర్త చంద్ర (34) దారుణంగా హత్య చేశాడు. భార్యను మాట్లాడాలని చెప్పి గ్రామ శివారులోని తోటలోకి తీసుకెళ్లి, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితుడు తన అత్త నరసమ్మకు ఫోన్ చేసి, మీ కుమార్తెను చంపేశాను అని చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనతో భయపడిన నిందితుడు, వెంటనే గౌరిబిదనూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలు పద్మ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దంపతుల మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, హత్యకు గల అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


