మంచిర్యాల్ (అక్షరవేకువ) ఆగస్టు 20
భీమర మో ఉపధయయు కోస పఠశ కపకస సమవేశ జరిిది. ఈ సమవేశో మో ఎనరోమటో మొదటి సన సధిచినటు అధికరుు తిపరు. ఉతతమ పరతిభ కనబరిచిన పఠశ పరధనోపధయయును సనమనిచరు.
భీమారం మండలంలోని ఉపాధ్యాయులకు పాఠశాల కాంప్లెక్స్ సమావేశం ఈరోజు జడ్పీహెచ్ఎస్ భీమారం లో ఎంఈఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భీమారం మండలం మంచిర్యాల్ జిల్లాలో ఎన్రోల్మెంట్లో మొదటి స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, ఖాజీపల్లి పాఠశాల, తాళ్ల గూడెం పాఠశాలలు వరుసగా మొదటి, రెండు స్థానాలు సాధించినందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.
డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ టీమ్ సందర్శన
ఈ కాంప్లెక్స్ సమావేశాన్ని డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు గడ్డం సంపత్, మురళి గార్లు సందర్శించారు. పాఠశాలల పనితీరు, విద్యార్థుల నమోదు ప్రక్రియపై వారు సమీక్షించారు.
ఆర్పీల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో ఆర్పీలు సంతోష్, శ్రీనివాస్, కుమార్స్వామి, భారతి, పుష్పలత పాల్గొన్నారు. సమావేశంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల హాజరుశాతం పెంచడం వంటి అంశాలపై చర్చించారు.












