అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 12
భీమారం మండలం నందనవనం వెంచర్ లో నెలకొన్న వివాదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రజా ప్రతినిధులు, వెంచర్ నిర్వాకుల మధ్య గొడవలు, ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
భీమారం మండలం నందనవనం వెంచర్ లో ఏం జరుగుతోందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులకు, వెంచర్ నిర్వాకులకు మధ్య నెలకొన్న వివాదాలు, అందులో ప్రభుత్వ భూమి ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ లే అవుట్ గా పరిగణిస్తున్నా, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, చూసి చూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
అవసరమైన అనుమతులు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇళ్లు నిర్మించుకునే వారికి ఎదురయ్యే ఇబ్బందులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. వందల సంఖ్యలో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు అవుతుండటంతో అమాయక కుటుంబాలు నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్ పేరుతో ఏదైనా చేయవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వచ్చే సంచికలో ప్రచురితం అవుతాయి.











