భీమారం, 5 September
మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () శాఖలో మొండి బకాయిలున్న ఖాతాదారులకు శుభవార్త. ఈ నెల 1వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని రుణ విముక్తులు కావాలని శాఖ కార్యనిర్వహణ అధికారి జి. సుబ్బారెడ్డి సూచించారు.
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని రుణవిముక్తులు కావాలి భీమారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శాఖలో గతంలో రుణాలు తీసుకుని చెల్లించకుండా మొండి బకాయిలుగా ఉన్న ఖాతాదారులు ఈ నెల12 వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని రుణవిముక్తులు కావాలని శాఖ కార్యనిర్వహణ అధికారి జి. సుబ్బారెడ్డి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా మొండి బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) ద్వారా పరిష్కరించుకోవాలనుకునే అర్హత కలిగిన ఖాతాదారులు వ తేదీలోపు బ్యాంకును సంప్రదించాలని ఆయన సూచించారు. అర్హత, సెటిల్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఖాతాదారులు నేరుగా SBI శాఖను సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా, పంట రుణాలు పొందిన రైతు ఖాతాదారులు తమ రుణాలను సక్రమంగా చెల్లించి, గడువులోగా క్రాప్ లోన్ రెన్యూవల్ చేసుకోవాలని ఆయన సూచించారు. సంవత్సరంలోపు పంట రుణాలను రెన్యూవల్ చేసుకునే రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వడ్డీ రాయితీలకు అర్హత పొందే అవకాశం ఉందని తెలిపారు. రైతు ఖాతాదారులు బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని జి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. – జి. సుబ్బారెడ్డి కార్యనిర్వహణ అధికారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – శాఖ



