భీమారం మండలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి, అనగా 27-03-2026 శుక్రవారం శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, భీమారం మండలంలో శ్రీ సీతారామ చంద్రుల దివ్య కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి నిర్ణయించడమైనది. ఈ పవిత్ర కార్యానికి భక్త జన కోటిని ఆహ్వానిస్తున్నారు.
కార్యక్రమ వివరాల ప్రకారం, 26-03-2026 (గురువారం) సాయంత్రం 6:00 గంటలకు అధ్యాయనోత్సవము, 7:00 గంటలకు మంగళహారతి, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయబడతాయి. మరుసటి రోజు, 27-03-2026 (శుక్రవారం) ఉదయం 11:00 గంటలకు స్వస్తి పుణ్యావచనములు, బేదపూజ, దేవతాహ్వానము, అంకురారోపణం జరుగనున్నాయి.
అనంతరం మధ్యాహ్నం 12:35 గంటలకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు తీర్థప్రసాదాలు మరియు సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సాయంత్రం 6:00 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
29-03-2026 (ఆదివారం) సాయంత్రం 5:00 గంటలకు శ్రీవారి నాకబలి కార్యక్రమం జరుగనుంది. కళ్యాణం టిక్కెట్టు కొనుగోలు చేసినవారు 27-03-2026 ఉదయం 11:30 గంటలకు మంగళహారతి, పూజా ద్రవ్యములు, నీళ్ళ చెంబు ఒకటి తీసుకొని సతీ సమేతంగా వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, కృతార్థులు కావాలని నిర్వాహకులు కోరారు.












