రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.
ఇళ్లు లేని నిరుపేదలు, పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, వితంతువులు, అష్టకష్టాల్లో ఉన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు అన్ని మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల ముందు ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పిలుపునిచ్చారని వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రేపు ఉదయం ధర్నా కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.












