మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 27
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలను మోసం చేసిందని, ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఫల్యాలను బాకీ కార్డుల ద్వారా గ్రామగ్రామాన ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మాజీ సినీ ఫోటోగ్రఫీ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు.

నిరసన కార్యక్రమాల రూపకల్పన
మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లక్షట్ పేట, దండేపల్లి, సిసిసి, శ్రీరాంపూర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ వైఖరిని ప్రజల మధ్యకు తీసుకెళ్లే విధంగా, ప్రతి ఒక్కరికీ హస్తం పార్టీ మోసాలు తెలిసేలా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పాలనపై విమర్శలు
ఇప్పటికే 22ఏ నిబంధనల ఆంక్షలతో భూముల ఇక్కట్లు, రైతులకు యూరియా, రైతుబంధు, రైతు రుణమాఫీ, బ్యాంకు రుణాల వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రామ్మోహన్ రావు పేర్కొన్నారు. గత పాలన సువర్ణ దాయకంగా ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై వినిపించేందుకు గులాబీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.