కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మండల ఇన్చార్జి ఆకారం రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం జైపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
పార్టీ సీనియర్ నాయకులు అంబాల రవీందర్ రెడ్డి, మంతెన లక్ష్మన్‌లు ఆకారం రమేష్‌ను సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మండలంలోని 35 బూత్‌ల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ప్రతి బూత్‌లో నిబద్ధత కలిగిన కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పగించాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం, కాంగ్రెస్ పార్టీ విధానాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకారం రమేష్ అన్నారు.











