వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో నటుడిగా ప్రేక్షకులను అలరించనున్నారు. విశ్వక్ సేన్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ఫిల్మ్‌మేకర్ పాత్ర పోషిస్తుండగా, అనిల్ రావిపూడి కూడా దర్శకుడి పాత్రలోనే కొన్ని సన్నివేశాల్లో కనిపించనున్నట్లు సమాచారం.
దర్శకత్వంతో పాటు టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడికి నటనపై కూడా ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో వెండితెరపై ఆయన కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
రూట్ నోడ్ సినిమా, ఎస్ ఒరిజినల్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.












