సారంగాపూర్ మండల కేంద్రంలోని జామ్ గ్రామంలో, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది.
ఈ సభలో, సర్పంచ్ కరిపే రవళి విలాస్ అధ్యక్షతన, డిపిఓ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. 2026 సంవత్సరానికి అమలులోకి వచ్చే ఘణ వ్యర్థ నిర్వహణ నియమాలు గురించి వివరించారు.
పర్యావరణ పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్లాస్టిక్ నివారణలో భాగంగా జ్యూట్ బ్యాగ్‌ల పంపిణీ చేయడం జరిగింది.
మార్కెట్ ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లను ఏర్పాటు చేశారు. "ఏక్ ఫెడ్ మా కే నామ్" కార్యక్రమంలో, ఇందిరమ్మ కాలనీలో మొక్కలు నాటారు.












