దృష్టి (అక్షరవేకువ) సెప్టెంబర్ 07
గణేష్ నవరాత్రుల సందర్భంగా విద్యుత్ భద్రతా చర్యలపై ట్రాన్స్కో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మండప నిర్వాహకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ బి. రాజన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం 2 డీఈలు, 6 ఏడీలు, 22 ఏఈలను రంగంలోకి దించుతోంది.
గణేష్ నవరాత్రుల ట్రాన్స్కో అధికారులకు ఆదేశాలు జారీ మండప నిర్వహకులు జాగ్రత్తలు తప్పనిసరి తమ సిబ్బందితో సమన్వయం చేస్తాం ప్రమాద హెచ్చరికలకు అప్రమత్తత అవసరం 2 డీఈలు 6 ఏడీలు 22 ఏఈలు రంగంలోకి మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూర్ పరిధిలో సూచన జాగ్రత్తలపై ప్రత్యేక జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ బి రాజన్న మంచిర్యాల సిటీ (ఆంధ్రప్రభ)గణేష్ నవరాత్రుల ట్రాన్స్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, మండప నిర్వహకులు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని, తమ సిబ్బందితో సమన్వయం చేస్తూ ప్రమాద హెచ్చరికలకు అప్రమత్తత నివారణ మార్గాలుగా ఉన్నాయని దీనికోసం జిల్లా యంత్రాంగం 2 డీఈలు 6 ఏడీలు 22 ఏఈలు రంగంలోకి దింపుతున్నట్లు మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూర్ పరిధిలో సూచన జాగ్రత్తలపై ప్రత్యేక పెట్టినట్లు జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ బి రాజన్న స్పష్టం చేశారు. గత ఏడాది వినాయక చవితి నేపథ్యంలో 2185 మండపాలకు రామ సౌకర్యాలు అందించామని 10 శాతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ తగు చర్యలు తో యాక్షన్ ప్లాన్ లోకి దిగుతున్నట్లు చెప్పారు. విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు వద్ద మండపాలకు నిషేధాజ్ఞలు ఉన్నాయని ప్రమాద రహిత చోట నెలకొల్పాలని ప్రమాద సూచనలుగా మండపాల వద్ద క్వాలిటీ కేబుల్ ఐరన్ రైతులకు దూరంగా త్రిపిన్ ప్లగ్గులు స్విచ్ బోర్డులు నాణ్యమైనవి వాడాలని అనుభవజ్ఞులైన ద్వారా వైరింగ్ చేపించాలని చెప్పారు. పిల్లలకు అందనంత వ్యక్తులు బోర్డు నెలకొల్పాలని అన్నారు. జనరేటర్ ఇన్వైటర్ ఏర్పాటు చేస్తే రివర్స్ పవర్ పాస్ జరగకుండా చూడాలని వెల్లడించారు. తమ యంత్రాంగ మొత్తం అప్రమత్తంగా అందుబాటులో ఉన్నప్పటికీ మండపాల నిర్వహణ ల సమన్వయం సంప్రదింపులు జరగాలని ప్రమాద నివారణకు సామూహికంగా పాలుపంచుకోవాలని సూచన చేశారు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ 1912 సంప్రదించాలన్నారు. ఉమ్మడిగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలతో నవరాత్రుల తోపాటు నిమజ్జనాన్ని శాంతియుతంగా పూర్తి చేసేందుకు తమ శాఖ ద్వారా సిద్ధంగా ఉన్నట్లు ఎస్సీ రాజన్న స్పష్టం చేశారు. మంత్రి వివే వెంకటస్వామి తోపాటు ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వినోద్ ల ఆదేశాలతో పూర్తిస్థాయి విద్యుత్ శాఖ సౌజన్యంగా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు












