గుడిహత్నూర్, 19 November
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ జయంతిని ఉపాధ్యక్షులు మోహితే మారుతీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ జయంతిని ఉపాధ్యక్షులు మోహితే మారుతీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి మహిళా ప్రధానిగా, ఉక్కు మహిళగా దేశం కోసం ఎన్నో సంస్కరణలు చేసిన ఘనత సాధించారని నాయకులు ఆడే జైపాల్, విష్ణు పటేల్, మోతేవర్ గణపతి, రాథోడ్ రమేష్, ప్రమోద్, దిగంబట్, దర్బార్ సింగ్, సుబేధార్ బలరాం కొనియాడారు.



