బనస్కాంత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జిల్లాలో శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రూ.14 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. రైతులకు ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత నిధులను కూడా విడుదల చేశారు.
లోని భిల్డీ వద్ద 127 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. పశువుల జాతి అభివృద్ధి, జన్యు మెరుగుదల, ఆధునిక పునరుత్పత్తి సాంకేతికతలపై ఈ కేంద్రం పనిచేయనుంది. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన కాంక్రేజ్ పశువుల జాతి అభివృద్ధికి ఇది ఉపయోగపడనుంది.
థరాడ్, రాధన్‌పూర్ ప్రాంతాల్లో బనాస్ డెయిరీ ఏర్పాటు చేయనున్న రెండు జీవ ఇంధన వాయు ప్లాంట్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్లు రోజుకు వరుసగా 75, 100 మెట్రిక్ టన్నుల పశువుల పేడను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో నిర్మించనున్నారు.
మెట్రో, రహదారుల అభివృద్ధి
అహ్మదాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా విమానాశ్రయం, గిఫ్ట్ సిటీ వరకు మార్గాల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. విమానాశ్రయం వైపు ఆరు కిలోమీటర్లకు పైగా, గిఫ్ట్ సిటీ వైపు 3.3 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గం నిర్మించనున్నారు. అహ్మదాబాద్మెహసానా రాష్ట్ర రహదారిని నాలుగు వరుసల నుంచి ఎనిమిది వరుసలకు విస్తరించేందుకు సుమారు రూ.2,600 కోట్లతో చేపట్టే పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అహ్మదాబాద్ నుంచి ఉత్తర గుజరాత్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
రైతులకు రూ.19 వేల కోట్ల పీఎం కిసాన్ నిధులు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు సుమారు రూ.19 వేల కోట్లను విడుదల చేశారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పూర్తయిన 521 ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేశారు. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.4,950 కోట్లు. ఇందులో శీతల గిడ్డంగులు, నిల్వ కేంద్రాలు, ఆహార శుద్ధి కేంద్రాలు, గ్రీన్‌హౌస్‌లు ఉన్నాయి. సనాదర్లో బంగాళాదుంపల శుద్ధి కేంద్రం విస్తరణను ప్రారంభించారు. పాలన్‌పూర్‌లో పాల ఉత్పత్తుల నిల్వకు సంబంధించిన ఆటోమేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే 1.46 లక్షల హెక్టార్ల పరిధిలో 12 ఉద్యానవన క్లస్టర్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా 1.3 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలగనుంది.
కొత్త రైళ్లు, అంగన్వాడీ కేంద్రాలు
అహ్మదాబాద్ (సబర్మతి)వారణాసి ఎక్స్‌ప్రెస్, మెహసానాబెచరాజీసబర్మతి మెము రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్లో రూ.800 కోట్ల పెట్టుబడితో 4,030 కొత్త బాలల అనుకూల అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన మరో 361 కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం తెలిపింది.
కార్యక్రమాల అనంతరం మోదీ ఏక్తా నగర్‌కు వెళ్లారు. అక్కడ భారత్ పర్వ్2026ను ప్రారంభించారు. ఈ ఉత్సవంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంప్రదాయాలు, జానపద కళలు, ప్రాంతీయ వంటకాలు, హస్తకళలు, పర్యాటక ప్రాంతాలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలు వరకు కొనసాగుతాయి. అదే రోజు ఏక్తా ప్రకాశ్ పర్వ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల ప్రదర్శనను వీక్షించారు. ఇందులో భాగంగా 530 మీటర్ల పొడవైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ రోడ్డుపై ప్రత్యేక వెలుగుల అలంకరణ, 180 మీటర్ల పొడవైన గ్లో టన్నెల్ ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ఈ ప్రదర్శనల్లో చూపించనున్నారు. అనంతరం నర్మదా హారతిలో పాల్గొన్నారు.












