అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 11
పేదల సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీ పథకం ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాసామల్ల అశోక్ ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం లబ్ధిదారులకు నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు.
ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాసామల్ల అశోక్ మాట్లాడుతూ, పేదల సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్జీతో భారాన్ని మోపిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకొచ్చి, ఈనెల 1వ తేదీ నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ (వీబీజీరామ్‌జీ)ను అమల్లోకి తెచ్చిందని తెలిపారు.
ఇప్పటివరకు ఉపాధి హామీ పథకానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అనుసంధానం చేశారని, దీని ద్వారా ప్రతి ఇంటి నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారుడికి 90 రోజుల పని దినాలకు వేతనంగా రూ.27 వేల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేసిందని వివరించారు.
నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకం మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉపాధి కూలీ పనులను తొలగించారని, ఇలాంటి నిర్ణయం వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని రాసామల్ల అశోక్ పేర్కొన్నారు.











