హజీపూర్, 2026-11-21
హాజీపూర్ మండలం టీకన్నపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి కిషన్ ప్రారంభించారు. అర్హులైన గ్రామీణ ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా భరోసా ఉంటుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రజలు ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కిషన్ అన్నారు. శుక్రవారం ఆయన హాజీపూర్ మండలం టీకన్నపల్లిలో బీమా పథకాన్ని ప్రారంభించి, దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా భరోసా ఉంటుందని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతమ్మ, ఎంపీడీవో సాయి వెంకటరెడ్డి, ఎంపీవో సుమన్, కార్యదర్శి హారిక, గ్రామస్తులు పాల్గొన్నారు.



