గుడిహత్నూర్, 2026-11-24
గుడిహత్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లూరి గ్రామంలో పార్టీ నాయకులు కరపత్రాలు పంపిణీ చేసి, పథకం వివరాలను ప్రజలకు తెలియజేశారు.
గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు ఆధ్వర్యంలో, సర్పంచ్ ధనలక్ష్మి మనోజ్ లతో కలిసి, డీసీసీ డాక్టర్ నరేష్ జాదవ్ ఆదేశానుసారం, ఈరోజు పార్టీ కార్యకర్తలతో కలిసి బెల్లూరి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. పథకం ఉద్దేశ్యాలు, ప్రయోజనాలు, అర్హతలు, నమోదు ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మోహితే మారుతీ, పీఓఎస్ పర్సన్ ఆడే జైపాల్, సమీర్ ఖాన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

