నార్త్ ఇన్ హోటల్ (అక్షరవేకువ) సెప్టెంబర్ 09
కాళ్ల పుండ్లపై సరైన అవగాహనతో చికిత్స అందిస్తే నివారణ సాధ్యమని, నరాల బ్లాక్‌ల వల్ల పుండ్లు ఏర్పడతాయని యశోద హాస్పిటల్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. చక్కెర వ్యాధి (షుగర్) వంటి ఆరోగ్య సమస్యలతో కాళ్ల నరాలపై పుండ్లు ఏర్పడినప్పుడు, వాటిని ప్రథమ చికిత్సగా గుర్తించి వెంటనే వైద్యం అందించాలని ఆయన సూచించారు.
కాళ్ళ పుండ్లపై అవగాహనతోనే చికిత్స నివారణ చేయవచ్చని నరాల బ్లాక్ లతో పుండ్ల ఏర్పాటు జరుగుతుందని షుగరు తదితర ఆరోగ్య సమస్యలతో కాళ్ల నరాలపై పుండ్లు ఏర్పడి క్రమంలో ప్రథమ చికిత్సగా గుర్తించి వెంటనే వైద్యం అందించాలని అలాగే యాంజియోగ్రామ్ ద్వారా కాళ్ల నాలాల పూటిక గుర్తింపు తగు ఔషధాలతో నయం చేసే విధంగా ట్రీట్మెంట్ ఉంటుందని, సిరలు ,ధమనులు పై ఏర్పడ్డ త్వరగ తిన గుర్తించి వైద్యంఅందించాలనీ,యశోద వాస్కులర్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నార్త్ ఇన్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. వెరికోస్, నరాల రక్తం సరఫరా నిలిచిపోవడంతో నల్లటి మరకలు కనిపిస్తాయని అప్పుడే గుర్తించకపోతే పుండ్లు పెద్దవిగా ఇబ్బందులకు గురి చేస్తే సిటీ స్కాన్ ఎమ్మారై టెస్టుల ద్వారా పుండ్ల పుట్టుక మూలాలను గుర్తించి తగురీతిలో యశోద వైద్యం ఉంటుందని వినయ్ కుమార్ వెల్లడించారు. చికిత్సల సైతం కాలానికి అనుగుణంగా మార్పులతో ప్రస్తుతం కాళ్లపై ఏర్పడ్డప్పుడులకు యాంజియోగ్రామ్ టెస్టింగ్ ద్వారా గుర్తించి వైద్యాన్ని అందిస్తే పుండ్లు మానిపోతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కాళ్లను సైతం పరిశీలించాలని మార్పులు చేర్పులు గమనించాలని పుండ్లు ఏర్పడితే వైద్యులను సంప్రదిస్తే త్వరగా నయమయ్యేలా చికిత్సలు ఉంటాయన్నారు లేని పక్షంలో ఆరోగ్య రక్షణకు పెద్ద ఎత్తున వైద్యం బైపాస్ సర్జరీలు చేయాల్సి ఉంటుందన్నరు. ఈ సమావేశంలో యశోద సికింద్రాబాద్ మేనేజర్ అంకం మల్లేష్ పాల్గొన్నారు.












