మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 26
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్ట పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను కన్నుల పండువగా నిర్వహించారు. నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్ట పోచమ్మ ఆలయ బోనాలను కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయని, పలువురు క్రీడాకారులకు, విద్యార్థులకు, నూతనంగా వివాహం చేసుకున్న దంపతులకు, ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్న బాధితులకు ఆర్థికంగా చేయూతతో పాటు పలు రకాల సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్ అన్నారు. ఇందులో భాగమే కట్ట పోచమ్మ ఆలయ బోనాలు అని, పోచమ్మ తల్లిని నిండుగా పూజిస్తూ రెండేళ్లుగా తన నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని నిషా క్రాంతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, మియాపురం లక్ష్మణ్, గంప నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.












