అక్షరవేకువ (అక్షరవేకువ) ఆగస్టు 01
వంజెతంబంధంని,ఎల్లంపల్లింిజెఉండగాగజఎల్లంపల్లింనిభనిఖంతిఉతతంెడడితవవి.తెంగణజగబనిింనియనఅనన.ంతబృంంఎల్లంపల్లింి,గివడంహౌనంింి,నితింఏైజిింి.
కాలేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉండగా మాజీ సీఎం కేసీఆర్ లక్ష కోట్లు సముద్ర పాలు చేశారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు జన్మజన్మలకు గులాబీ పార్టీని క్షమించరని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, దుదిర్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. మంత్రుల బృందం ముందుగా ఎల్లంపల్లి నీటిమట్టాన్ని పరిశీలించింది. అనంతరం గోలివాడ పంప్ హౌస్‌లలో పనులు పరిశీలించి, నీటి లెఫ్ట్ పనిచేయడం గురించి ఆరా తీసింది.
హైదరాబాద్ నీటి తరలింపుపై సమాచార సేకరణ చేసిన మంత్రులు, ఎల్లంపల్లి నుండి నీటిని వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.










