Mancherial/Kotapalli (అక్షరవేకువ) జూలై 06
కోటపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. బెల్లంపల్లికి చెందిన విద్యార్థిని శనివారం రాత్రి వరకు పాఠశాలలోనే ఉండగా, ఆదివారం ఉదయం కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోటపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ) నుంచి ఒక ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లు సమాచారం. బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థిని గత నెల 30వ తేదీన పాఠశాలలో బైపిసి మొదటి సంవత్సరంలో చేరింది.
శనివారం రాత్రి వరకు పాఠశాలలోనే ఉన్న విద్యార్థిని ఆదివారం తెల్లవారేసరికి కనిపించకుండా పోయింది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని తల్లితండ్రులకు సమాచారం అందించారు.
తల్లితండ్రులు ఆ ప్రాంతమంతా వెతికినప్పటికీ విద్యార్థిని ఆచూకీ లభించలేదని తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.












