East Godavari/Rajamahendravaram Rural (అక్షరవేకువ) జూలై 07
కొమరం భీం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు భొనగిరి సతీష్ బాబు మంచిర్యాల పర్యటన సందర్భంగా, బిజెపి సీనియర్ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ, సతీష్ బాబు గారు అన్ని రంగాలలో క్రమశిక్షణతో కూడిన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు.
కొమరం భీం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు భొనగిరి సతీష్ బాబు మంచిర్యాలకు విచ్చేసిన సందర్భంగా వారికి కర్రె లచ్చన్న కార్యాలయంలో, బిజెపి సీనియర్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి సతీష్ బాబు గారు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ, మరియు న్యాయవాద వృత్తి వంటి అన్ని బాధ్యతలను ఆ పదవులకు వన్నెతెచ్చే విధంగా క్రమశిక్షణతో నిర్వర్తించే నాయకులని కొనియాడారు.
వారి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్షత కారణంగా కొమరం భీం జిల్లా కోర్టు న్యాయవాదులు నాలుగవసారి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం వారికి దక్కిన అపూర్వ గౌరవమని అన్నారు. భొనగిరి సతీష్ బాబు గారు న్యాయవాద వృత్తిలో భారతీయ జనతా పార్టీకి, హిందూ సంస్థలకు ఎనలేని సేవలు అందించడమే కాకుండా, వృత్తిపరంగా పేదలకు సైతం ఉచితంగా సేవలు అందించే సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మున్నా రాజా సిసోడియా, తుల మధుసూదన్ రావు, కర్రే లచ్చన్న, బొలిశెట్టి తిరుపతి, మేడిపల్లి సత్యం, ముక్త సంతోష్, సుధాకర్, రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.












