హజీపూర్, 8 September
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మండలం కొలం గూడా గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు. సీనియర్ లయన్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహకారంతో మండలం కొలం గూడా గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల 25 మంది విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ వస్తువులను ఈరోజు అందజేశారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీ రాజేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లైన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే, ఈ గిరిజన గ్రామమైన కొల్లం గూడాలోని పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. అనంతరం, పిల్లలతో కలిసి అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వినయ్ కుమార్, లయన్ పి. ప్రభాకర్ రావు, లయన్ డేగ బాబు, గ్రామ సర్పంచ్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

