రామగుండం, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జీ పరిధిలోని లైన్స్ క్లబ్ మంచిర్యాల శాఖకు 2025-26 సంవత్సరానికి గాను అందించిన సేవలకు గాను 14 అవార్డులు లభించాయి. రామగుండంలోని ఆర్.ఆర్. గార్డెన్లో ఈరోజు నిర్వహించిన సేవా అభినందన అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందజేశారు.
లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జీ పరిధిలోని లైన్స్ క్లబ్ మంచిర్యాల శాఖకు 2025-26 సంవత్సరానికి గాను అందించిన సేవలకు గాను 14 అవార్డులు లభించాయి.
రామగుండంలోని ఆర్.ఆర్. గార్డెన్లో ఈరోజు నిర్వహించిన సేవా అభినందన అవార్డుల కార్యక్రమంలో, 2025-26 క్లబ్ అధ్యక్షులుగా ఉన్న లయన్ కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి లయన్ పి. సుధాకర్ రెడ్డి, కోశాధికారి లయన్ రామస్వామి, రీజియన్ చైర్పర్సన్ లయన్ కొత్త సురేందర్, జోన్ చైర్పర్సన్ లయన్ ఏ. బాలాజీ, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ ఇరుకుల ఆనంద్, లయన్ ఎం. రామాంజనేయులు, లయన్ వి. వినయ్ కుమార్, లయన్ డాక్టర్ కే. సుగుణాకర్ రెడ్డి, లయన్ పి. హనుమంతరావు, లయన్ జి. శ్యాంసుందర్ రావు గార్లకు వారి అమూల్యమైన సేవలకు గాను వ్యక్తిగత అవార్డులను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాం, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఎన్. వెంకటేశ్వరరావు, లయన్ దీపక్ భట్టాచార్య, ప్రస్తుత గవర్నర్లు లయన్ మోర బద్రేశం, లయన్ చంద్ర ప్రకాష్, లయన్ చంద్రమోహన్ గౌడ్ గార్లు అందజేశారు.
ఈ సేవా అభినందన కార్యక్రమం లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జీ ఆధ్వర్యంలో జరిగింది. క్లబ్ సభ్యులు తమ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు ఇతర ప్రముఖులు సభ్యుల సేవలను కొనియాడారు.











