మంచేరియల్, 2026-11-21
మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఎథిక్ అకాడమీ ది ఎలిమెంటరీ స్కూల్ ఆధ్వర్యంలో ది ఎంపతీ ఫెస్ట్2026 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు.
మంచిర్యాల: విద్యార్థుల్లో సేవాభావం, సహానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఎథిక్ అకాడమీ ది ఎలిమెంటరీ స్కూల్ ఆధ్వర్యంలో ది ఎంపతీ ఫెస్ట్2026 కార్యక్రమాన్ని రెడ్‌క్రాస్ ఆనందనిలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వృద్ధులకు దుప్పట్లు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి వారితో ఆప్యాయంగా గడిపారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఉపయోగించదగిన దుస్తులు, బొమ్మలు, పుస్తకాలను సైతం స్వచ్ఛందంగా సేకరించారు.
మంచి మార్కులతో పాటు మంచి మనుషులుగా ఎదగడమే విద్య లక్ష్యమని పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ నాగిరెడ్డి మల్లారెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



