మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 12
మంచిర్యాల జిల్లాలో 22ఏ భూముల నిషేధం రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 11వేల గృహాలు, 5528 ఎకరాల వ్యవసాయేతర స్థలం నిషేధిత జాబితాలో చేరడంతో వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. బాధితులు ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
22 ఏ భూముల నిషేధిత పై మంచిర్యాల స్టేట్లో హాట్ టాపిక్ గా మారింది. బాధితులు ప్రభుత్వ చర్యలపై రగులుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని శుక్రవారం హైదరాబాదులో బీ ఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సైతం డిజిటల్ స్క్రీన్ ప్రజెంటేషన్ లో మంచిర్యాల పరిస్థితులు సర్వే నెంబర్లు బాధితులకు వివరాలను ప్రస్ఫుట్టించిన విషయం విధితమే. ఈ నిషేధిత జాబితాలోకి 11వేల గృహాల వస్తున్నట్లు తెలుస్తుంది. 5528 ఎకరాల వ్యవసాయేతర స్థలం నిషేధిత జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది 10 నెలలుగా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చిన కాలయాపన కొనసాగడంతో క్రయవిక్రయాలు పూర్తిగా పడకే సాయి. మంచిర్యాలలో డమాల్ అన్న రియల్ ఎస్టేట్ బిల్డర్ భవన నిర్మాణరంగం కనిపిస్తుంది ఎలాంటి అమ్మకాలు సాగపోవడంతో డబ్బు చలామణి సైతం పూర్తిగా మార్కెట్లో తగ్గుముఖం పట్టింది. వ్యాపారంలో తీవ్రస్పద్దత నెలకొని ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నైతిక మద్దతు ఇచ్చినప్పటికీ బాధితుల్లో విచారం తొలగడం లేదు. కోలుకొని బాధితులు 22ఏలో ఉన్నవారికి తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. అత్యవసర పరిస్థితుల్లో స్థలాలు గృహాలు అపార్ట్మెంట్లు అమ్మకాలు సాగితేనే వ్యాపారంతో పాటు పెట్టుబడుదారులకు కలిసొచ్చే అంశం అది మొత్తం 22 ఏ నిషేధిత ఆజ్ఞలు వ్యాపించడం తో ఎక్కడికక్కడ బిజినెస్ నిలిచిపోయింది. బ్రోకర్లు విక్రయదారులు పెట్టుబడుతారు పూర్తిగా గమ్మునుండే పరిస్థితి నెలకొంది. నిరసన ధర్నాలతో బీ ఆర్ఎస్ బిజెపి పార్టీలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షాలు మంచిర్యాల పరిస్థితి ఆ గమ్య గోచరంగా రియల్ ఎస్టేట్ బిల్డర్ భవన నిర్మాణాల రంగం కుప్ప కూలే లా కనిపిస్తుంది.












