హమాలివాడ, మంచిర్యాల టూ టౌన్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
మంచిర్యాల టూ టౌన్ హమాలివాడలోని భక్తంజనేయ షిరిడి దేవస్థానం వద్ద గణేశ నవరాత్రుల సందర్భంగా మండప నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. శ్రీ భక్తంజనేయ సాయి గణేష్ మండలి, వనరసేన యూత్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఈనెల 14న ప్రారంభమైన గణేశుని నవరాత్రులలో భాగంగా, మంచిర్యాల టూ టౌన్ హమాలివాడలోని భక్తంజనేయ షిరిడి దేవస్థానం ముందు వినాయక కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పనులను కార్పొరేటర్లు నల్ల శంకర్ గాండ్ల సత్తమ్మ కర్రు శంకర్ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి పాల్గొన్నారు. శ్రీ భక్తంజనేయ సాయి గణేష్ మండలి, వానరసేన యూత్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో పంచాల నవీన్, బద్రి మనోజ్, బోజ్జ క్రాంతి, తోగరి శ్రీకాంత్, తోగరి రాజేష్, బోజ్జ శ్రావణ్ ఉన్నారు.












