సినిమా వాడా, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 08
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని సినిమా వాడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంచిర్యాలలో ఘనంగా అక్షరాస్యత దినోత్సవం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దత్తత పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహణ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో దత్తత పాఠశాల అయిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల సినిమా వాడాలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులచే అక్షరాస్యత మీద అవగాహన కల్పించుట కొరకు ర్యాలీని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథి శ్రీనివాస్ గారు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసము గురించి నిరక్షరాస్యత నిర్మూలన గురించి వివరిస్తూ ప్రభుత్వము విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాలలో ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి అర్హత కలిగినటువంటి అధ్యాపక బృందం ఉన్నారని కావున విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలనే ఎంచుకొని విద్యనభ్యసించాలని విజ్ఞప్తి చేసినారు. తదుపరి విద్యార్థిని విద్యార్థుల తో ప్రతిజ్ఞను చేపించినారు. అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ను నిర్వహించి వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను లైన్స్ క్లబ్ ద్వారా ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ డి వేణుగోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభావతి, లైన్స్ క్లబ్ సీనియర్ లైన్ మెంబర్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, లయన్ వి వినయ్ కుమార్, లయన్ పి ప్రభాకర్ రావు , సుమన్, పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.












