మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 29
ంచియలపొేషనపిధిలోనిపంతలలోఉనన11ెి33లనఖళీపదేశలలోిచేపియఆోదండిపయూటీీఎంఒపపించినఎెలయేలభించింది.ఎెలయేపేచొతోడిపయూటీపయూటీీఎంబటటిిఈపతిపదనఆోదంతెలిప.దీనిి12ోటలూపయలయయంనంది.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నివాస ప్రాంతాల్లో ఉన్న 11 కెవి 33 మార్గాలను ఖాళీ ప్రదేశాల్లోకి మార్చే ప్రక్రియకు ఆమోదం లభించింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పలుమార్లు ప్రతిపాదనలు అందడంతో ఈ ప్రతిపాదనకు ఎట్టకేలకు ఆమోదం లభించినట్లు సమాచారం.
విద్యుత్తు లైన్ల మార్పునకు 12 కోట్ల రూపాయల వ్యయంతో ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించిందని, దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం జరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలు విద్యుత్తు లైన్ల కింద ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పలుమార్లు డిప్యూటీ సీఎంను ఒప్పించి ఈ ఆమోదం సాధించారు.
లైన్ల మార్గం మారుతుండటంతో ప్రజలు ఇబ్బందుల నుంచి విముక్తి పొందనున్నారు. ఎమ్మెల్యే చేసిన కృషికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.











