మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 29
చ చపొేషషజఅేషపశధభగ120ఔటగబధచజబషటఅేషూటెటపచేపటట.ఇజగభగఅేషగృచెటబఒగ744భచేడపపపప.
మంచిర్యాల కార్పొరేషన్ లో పారిశుద్ధ్య విభాగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో 120 మంది కార్మికుల నియామకానికి సంబంధించిన జాబితాను రాష్ట్ర సీఎస్ ఆమోదం అనంతరం చేపట్టనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ జి. అన్వేష్ తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి వారసత్వంగా 74 మందిని భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం వారసత్వ నియామక ప్రక్రియను నిలిపివేసిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో వారసత్వ నియామకాలకు అవకాశం కల్పిస్తూ జీవోలు విడుదల చేయనుందని తెలిపారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.










