పరిశీలన (అక్షరవేకువ) సెప్టెంబర్ 05
మంచిర్యాల జిల్లాలో ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్ అమలు తీరును జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మేడమ్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, డీలర్లతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఆమె సమీక్షించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సులభతరం లక్ష్యంగా ఈ యాప్ ను రూపొందించినట్లు తెలిపారు.
ఫెర్టిలైజర్ సేల్ యాప్ క్షేత్ర స్థాయిలో పరిశీలన- జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల - సురేఖ తేదీ 5-09-2026 రోజున ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ యాప్ ను జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మేడమ్ క్షేత్ర స్థాయిలో రైతులతో మరియు డీలర్స్ ఆన్లైన్ లో నమోదు ప్రక్రియ ను వివరాలను పరిశీలించారు. రైతులు తమ ఆధార్ నెంబర్ తో భూమి వివరాలు వచ్చిన తరువాత , రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేసిన తర్వాత యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, DAP, MOP ను QR కోడ్ తో సంబంధిత డీలర్ వద్ద తీసుకోవచ్చును. రైతులకు ఎరువుల బుకింగ్ మరియు యాప్ వినియోగంపై ఎటువంటి సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా, సమీపంలోని వ్యవసాయ అధికారి (AO), వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మరియు సంబంధిత ఎరువుల డీలర్ల సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించేందుకు ఈ యాప్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల సురేఖ వ్యవసాయ అధికారి హాజీపూర్ క్రిష్ణ వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక DCMS ముల్కల్ల డీలర్ సంతోష్ రైతులు












