జగిత్యాల, 13 September
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్ సమీపంలో ఆదివారం రైలు కింద పడి తండ్రీకొడుకులు మృతిచెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతులు జిల్లా గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేష్, ఆయన కుమారుడు నాగరాజుగా గుర్తించారు.
మంచిర్యాలలో రైలు కింద పడి తండ్రీకొడుకు మృతి మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. జిల్లా గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేష్, ఆయన కుమారుడు నాగరాజు రైలు కింద పడి మృతిచెందారు. గతంలో భూపాలపల్లిలో మల్లేష్‌కు బంధువుతో గొడవ జరగడంతో కేసు నమోదైంది. వాయిదాలకు హాజరుకాకపోవడంతో భయాందోళనకు గురై ఈ ఘటనకు పాల్పడినట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్, హెచ్‌సీ సంపత్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ సంఘటన దావనంలో వ్యాపించడంతో మృతి పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురిని ఈ సంఘటన తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.

