మందమరి పట్టణంలో 60 ఏళ్లు పైబడిన సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం ఉచిత యోగా శిక్షణా కార్యక్రమం సోమవారం సింగరేణి గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని యోగా శిక్షకుడు కొంపెల్లి రమేష్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కమిషనర్ రాయలింగ్, సింగరేణి జీఎం రాధాకృష్ణ ప్రారంభించారు.
ఈ శిక్షణా శిబిరానికి డివిజన్లోని అన్ని గనుల విభాగాల నుంచి రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ నాయకులు వాసాల శంకర్, వీరన్న, జక్కం రాజన్న, పోల్ సంపత్, ఆసం కొమరన్న, దాసరి ఎల్లారం, నామముని ముత్తన్న, నెల్లి రాయలింగ్, జెట్టి రవి, గసిగంటి మల్లయ్య, మంతెన భూమన్న, ఎండి ఖలీల్, పర్ల పెళ్లి పోశం, శనిగార వెంకన్న, గాండ్ల రవి, తుంగపిండి శంకర్ పాల్గొన్నారు.
రిటైర్డ్ కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఈ ఉచిత శిక్షణ ఏర్పాటు చేయబడింది. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై శిక్షకుడు రమేష్ అవగాహన కల్పించారు.











