మంచేరియల్, 2026-11-26
మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులపై గురువారం చర్చించారు. ఈ భేటీ మంచిర్యాల కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులపై గురువారం చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
ఇటీవల కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకుల వివరాలు, మంచిర్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలను మంతెన జగన్మోహన్ ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్లోకి తీసుకురావడం ద్వారా పార్టీ బలాన్ని మరింత పెంచే దిశగా చేపడుతున్న ప్రయత్నాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ వర్గాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగేందుకు తమ కార్యాచరణ ఉంటుందని ఎంపీకి వివరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గాంధీభవన్లో ఎంపీతో సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య పాల్గొన్నట్లు తెలిసింది.
ఏదేమైనా మంచిర్యాల కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు, తాజా రాజకీయ భేటీలు పార్టీ అంతర్గత రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కలయిక వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు, రానున్న రోజుల్లో మంచిర్యాల కాంగ్రెస్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

