మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 24
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో కాళీమాత ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురుజి రఘు స్వామి ఆధ్వర్యంలో మహా హోమం, కాళీమాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విశిష్టతను చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు ఘనంగా సాగాయి. ప్రత్యేక అలంకరణలో కాళీమాత భక్తులకు దర్శనమిచ్చింది. గాంధీనగర్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాలు చేపట్టారు. అర్కాల విజయ, పెట్టం తిరుపతి దంపతులు, ఇసంపెల్లి శ్రీనివాస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో సోమవారం రాత్రి కాళీమాత ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురుజి రఘు స్వామి ఆధ్వర్యంలో మహా హోమం, కాళీమాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విశిష్టతను చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు ఘనంగా సాగాయి.
ప్రత్యేక అలంకరణలో కాళీమాత భక్తులకు దర్శనమిచ్చింది. గాంధీనగర్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్కాల విజయ, పెట్టం తిరుపతి దంపతులు, ఇసంపెల్లి శ్రీనివాస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.






