నిర్మల్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు నిర్మల్ రూరల్ మండల పరిధిలో అక్రమ మద్య విక్రయాలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించబడ్డాయి.
ఇన్స్పెక్టర్ శ్రీ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం, నమ్మదగిన సమాచారం మేరకు ఇతర రాష్ట్రాల మద్యం నిర్మల్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఢాబాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో, మండిగుట్ట శివారులో గల సింగ్ ఈజ్ కింగ్ ఢాబాలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
తర్వాత, నిర్మల్ రూరల్ పరిధిలోని ఇతర ఢాబాలలో కూడా తనిఖీలు చేపట్టారు. అన్ని ఢాబా యజమానులకు తమ ప్రాంగణాల్లో మద్యం విక్రయాలు, నిల్వలు మరియు వినియోగానికి అనుమతి లేదని హెచ్చరించారు.
ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జీలు మరియు బ్యాంక్వెట్ హాల్స్‌పై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా లేదా నిల్వ ఉంచినా వారిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ తనిఖీలలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఆదిలాబాద్ శ్రీ గంగారెడ్డి, ఎస్ఐ శ్రీ అభిషేక్, డీటీఎఫ్ ఎస్ఐ శ్రీమతి సింధు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.








