మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 20
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసులు, రాజీకి అవకాశం ఉన్న వివాదాల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య తెలిపారు. లోక్ అదాలత్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది.
చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రుణాలు, కార్మిక వివాదాలు, విద్యుత్, నీటి బిల్లులు, మోటారు వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు, భూ సేకరణ, సివిల్ కేసులు వంటి రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని కోరారు.


