మంచేరియల్, 2026-11-26
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కార్యక్రమ చైర్పర్సన్ లయన్ వి.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కార్యక్రమ చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో క్లబ్ దత్తత పాఠశాల అయిన సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వినయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫాతిమా, ఉపాధ్యాయులు సాంబయ్య, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

