భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ రాష్ట్ర శాఖలో ముఖ్యమైన నియామకం జరిగింది. మంచిర్యాల జిల్లాకు చెందిన యువ నాయకులు రజనీష్ జైన్ ను మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఈ నియామకాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు సమక్షంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ సింగ్ ప్రకటించారు. పార్టీ నిర్మాణంలో, అభివృద్ధిలో, తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి తనపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా ఈ బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, పార్టీ ఉన్నతికి, తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని రజనీష్ జైన్ తెలిపారు. ఈ నియామకంపై ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు.
తన నియామకానికి సహకరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ అభిన్, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగ్ మోహన్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరవెల్లి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మున్నా రాజా, గోనె శ్యాంసుందర్ రావు, గోలి రాముతో పాటు మండల, జిల్లా, రాష్ట్ర నాయకులకు రజనీష్ జైన్ ధన్యవాదాలు తెలిపారు.








