బెల్లంపల్లి, 2026-11-26
జిల్లాలో కొనసాగుతున్న రీసర్వే పనులను ఖచ్చితత్వంతో, వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొని కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠికను పఠించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వివిధ రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రీసర్వే నూతన ఎస్ఓపి అమలు, హైకోర్టు కేసులకు సంబంధించి సి.సి.ఎం.ఎస్. స్థితిగతులు, భూ భారతి పాత, కొత్త పెండింగ్ కేసులు, భూసేకరణ పురోగతి, జి.ఓ. నంబర్ 59, 76 క్రింద క్రమబద్ధీకరణ దరఖాస్తులు, మీ-సేవ ధ్రువపత్రాల పెండింగ్ దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులపై సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పరిష్కరించాలని, నిర్దేశించిన విధివిధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని బూదఖుర్ద్ గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, మండల తహసిల్దార్ కృష్ణ, గ్రామ సర్పంచ్ లతో కలిసి పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.
అనంతరం నస్పూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, మండల పరిధిలో వివిధ రెవెన్యూ అంశాల పురోగతిపై తహసిల్దార్ సంతోష్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు కేసులకు సంబంధించి సి.సి.ఎం.ఎస్. స్థితిగతులు, భూ భారతి పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులు, జి.ఓ. నెం.59, 76 క్రింద క్రమబద్ధీకరణకు వచ్చిన పెండింగ్ దరఖాస్తులు, మీ సేవ ధ్రువపత్రాల పెండింగ్ దరఖాస్తులు, కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులు, ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులపై సమీక్షించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, నిర్దేశించిన విధివిధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

