సంగారెడ్డి, 10 September
జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ప్రయాణించే తల్లులు తమ శిశువులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి న్యూ బస్టాండ్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ రూమ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ మదర్ ఫీడింగ్ రూమ్‌ను మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, జిల్లా సంక్షేమ అధికారి కె.లలిత కుమారిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణించే తల్లులు తమ శిశువులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో తల్లిపాలు అందించేందుకు మదర్ ఫీడింగ్ రూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడంతో పాటు, మహిళలు మరియు శిశువుల సంక్షేమానికి ఇటువంటి సౌకర్యాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీ సుధాకర్ రావు, సీడీపీఓ చంద్రకళ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త గడ్డం పల్లవి, తహసీల్దార్ జయరాం, అంగన్వాడీ సూపర్వైజర్లు, పీవో లింగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.












