సంగారెడ్డి, 2026-08-12
ఈ నెల 15న సంగారెడ్డిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పోలీస్ అధికారులతో, ముఖ్య నాయకులతో ఐబీ గెస్ట్ హౌజ్లో సమావేశమయ్యారు. సీఎం సభకు జనసమీకరణ, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఐఐటీలోని హెలిప్యాడ్ నుండి నేరుగా ఐబీ చౌరస్తా వద్దకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరిస్తారని, అనంతరం సీఎం మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉమ్మడి జిల్లా నుండి వచ్చే లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాలను డీఈవో కార్యాలయంలో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఒక్క సంగారెడ్డి నియోజకవర్గం నుండే నలభై నుండి యాభై వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అధికారులు ఇరవై వేల మంది లబ్ధిదారులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణఖేడ్ నుండి ఐదువేలు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కలుపుకుని మొత్తం లక్ష మందిని సభకు తరలించేలా ప్రణాళిక చేస్తున్నట్లు జగ్గారెడ్డి, సంజీవ రెడ్డిలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు రఘుగౌడ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.