సంగారెడ్డి, 2026-08-19
సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు బోధించుటకు వివిధ విభాగాలలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం జరుగుతున్నదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు బోధించుటకు వివిధ విభాగాలలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం జరుగుతున్నదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తారా కళాశాలలో బీసీఏలో రెండు, ఆంగ్లంలో ఒకటి, అర్థశాస్త్రంలో ఒకటి; బీబీఏలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తారా కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని ఆమె పేర్కొన్నారు.
అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అభ్యర్థులకు అనుభవం, నెట్, స్లెట్, పీహెచ్డీ అర్హతలు ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని, ఈనెల 22వ తేదీన జరిగే డెమో మరియు ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక జిరాక్స్ సెట్ కాపీలతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు.












