చేర్యాల పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
చేర్యాల పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, ఆయన అనుచరులను వేదికపైకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సభలోని కొందరిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాట, ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్వల్ప లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఘర్షణ నేపథ్యంలో ఎంపీ చామల, ఎమ్మెల్యే పల్లా కార్యక్రమం పూర్తికాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


