మంచిర్యాల జిల్లా, క్యాతన్ పల్లి (అక్షరవేకువ) జూలై 02
ృనరేణైరబధకరణయరెృనరేణృనృనథైబీఆరఎృనచేృనననరేణరటనమన,మమటకరమరజనకరమరచనబదధమననరృనేరీనమచేృనననమీమరహరీషరృనటృనరర.మచరయకయనరేణరనృనరేణరరకషణృనదృనృనరేణఆయనమటడ,ృనృనథనృనకరణయఖనమరచరనఆరరేణచర.
సింగరేణి కాలరీస్ సంస్థపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న తమ పోరాటం నిక్కచ్చిగా ఉందని, తాము చెప్పే నిజాలు కాదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కుండబద్దలు కొట్టారు.
సింగరేణి పరిరక్షణ సదస్సులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి ఎంఎస్ఆర్ గార్డెన్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సింగరేణి స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హరీష్ రావు, సంస్థను స్కాంల సంస్థగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
సైట్ విజిట్ సర్టిఫికెట్, డీజిల్ కుంభకోణం, గ్గు కుంభకోణం.. ఇలా సిరుల గని సింగరేణిని కుంభకోణాల ఖనిగా మార్చారని వాపోయారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంతో తొలుత ప్రయోజనం పొందింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజనా రెడ్డియేనని హరీష్ రావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిస్మిస్లు మొదలయ్యాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దుర్మార్గపు లేబర్ కోడ్ లను సింగరేణి సంస్థలో అమలు చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కాంగ్రెస్ అంటేనే దోచుకో.. దాచుకో అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు.
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. ఈ సదస్సుకు వచ్చిన ఒక్కో సింగరేణి కార్మికుడు ఐదు వందల మందితో సమానమని, సదస్సు సారాంశాన్ని, సింగరేణిలో జరుగుతున్న వాస్తవాలను బస్తీల్లో, కాలనీల్లో చర్చకు తీసుకెళ్లాలని కోరారు.










