నిర్మల్, 16 July
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో తాటి, ఈత చెట్ల వనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. చెట్లు నరికివేసిన కుమ్మరి నర్సయ్యను అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో తాటి, ఈత చెట్ల వనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు చెట్లు నరికివేసిన కుమ్మరి నర్సయ్యను అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ రంగస్వామి మాట్లాడుతూ, తాటి చెట్లను నరికి వేస్తున్నట్లు తెలిపారు. చెట్లను నరకడం చట్టరిత్య నేరమని, అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరిత హరంలో భాగంగా తాటి చెట్లు, ఈత చెట్లను నాటి వనాలు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని, గీత వృత్తి దారుల సంఘాలు వాటిని కాపాడుకోవాలని సూచించారు.
నిందితుడిని విచారించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అభిషేక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











