మంచిర్యాల, ఆదిలాబాద్, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 09
తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తామని పార్టీ రాష్ట్ర మీడియా ఇంచార్జ్ దుంపటి శ్రీనివాస్, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల కోఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్ తెలిపారు. రాబోయే ఎన్నికల లక్ష్యంగా యువతను పార్టీలోకి చేర్చుకుంటామని వారు పేర్కొన్నారు.
తెలంగాణలో జనసేన దూకుడును పెంచుతా మనీ క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేత లక్ష్యంగా పనిచేస్తా మనీ జనసేన రాష్ట్ర మీడియా ఇంచార్జ్ దుంపటి శ్రీనివాస్, ఆదిలాబాద్ పెద్ద పళ్లి నియోజకవర్గాల కోఆర్డినేటర్ చుంచు రాజ్ కిరణ్ లు స్పష్టం చేశారు. గురువారం పద్మనాయక గార్డెన్లో పెద్దపల్లి ఆదిలాబాద్ నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ వేదికకు తెలంగాణ ఉద్యమకారురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వేదికకు నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం తో పాటు ప్రతి అసెంబ్లీ పరిధిలో జనసేన ను గ్రామస్థాయి వరకు చేర్చి యువ రక్తాన్ని జనసేనలోకి చేర్చి రాబోయే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి బలోపేతం చేయడం తమ ముందున్న కర్తవ్యం అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణలో పూర్తిస్థాయిలో పార్టీని పటిష్ట చేసి ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల అభిమానం చురగొనే విధంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత జన సైన్యంపై ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మెగాస్టార్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పులుపునిచ్చారు మంచిర్యాలలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు గొట్టేముక్కల నరేష్ రెడ్డి మంతెన సంపత్ నల్ల తీగల మహేష్ మ ల్లపల్లి విష్ణు తదితరులు పాల్గొన్నారు.


