హైదరాబాద్, 2026-06-05
సథసేద,,ఉధచేోఇడససూసటమదడేసద.ోటమహోమఇసటటూటఆఫట(హచఐట)ోభసమసూభచద.
తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరో ముందడుగు వేసింది. జపాన్లోని హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హెచ్ఐటీ)తో భాగస్వామ్యానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరింది.
జపాన్ పర్యటనలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం హెచ్ఐటీని సందర్శించి, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులపై చర్చించింది. విద్యార్థుల మార్పిడి, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన, సాంకేతిక కోర్సులపై సహకారం అందించనున్నారు.
భాగస్వామ్య రంగాల వివరాలు
అధునాతన తయారీ, ఆటోమొబైల్, ఏఐ, ఎలక్ట్రానిక్స్, ఆటో వె డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో సంయుక్త కార్యక్రమాలు చేపట్టనున్నారు. హెచ్ఐటీ ప్రతినిధులను హైదరాబాద్కు రావాలని, డిసెంబరులో జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్--2026లో పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు.












