జైపూర్, 2026-07-24
జైపూర్మండలంవేలాలగ్రామంలోNH-163Gజాతీయరహదారివిస్తరణపనులు,వర్షాలవల్లఏర్పడుతున్నరవాణా,డ్రైనేజీసమస్యలపైగ్రామడేగస్వప్నరాష్ట్రడాక్టర్జి.వివేక్వెంకటస్వామికివినతిపత్రంసమర్పించారు.ఆదేశాలమేరకువేలాలకమాన్వద్దరహదారిపనులుపూర్తయ్యాయి.
జైపూర్ మండలం వేలాల గ్రామంలో NH-163G జాతీయ రహదారి విస్తరణ పనులు, వర్షాల వల్ల ఏర్పడుతున్న రవాణా, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ డేగ స్వప్న రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు.
పాఠశాల వద్ద దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, వేలాల కమాన్ దగ్గర నీరు చేరి ఏర్పడిన గుంతలను పూడ్చి రాకపోకలను పునరుద్ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని గంగాదేవి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సహాయం అందించాలని, వర్షపు నీటి ప్రవాహం సజావుగా సాగేలా మైనర్ బ్రిడ్జిలు, కల్వర్టులను విస్తరించాలని కోరారు.
ఈ వినతిపై స్పందించిన మంత్రి కార్యాలయం, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా NH-163G ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) ను ఆదేశిస్తూ లేఖను సంబంధిత విభాగానికి పంపింది.
మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాలు, అలాగే మెగా (MEIL) వారి సహకారంతో వేలాల కమాన్ దగ్గర రహదారి నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయడం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












