7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలో విద్యాసాగర్ జామి ప్రసాదరావుకు ప్రత్యేక గౌరవం.
మందమర్రి, జూన్ 8: 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరం వేదికగా జూన్ 6, 7 తేదీలలో నిర్వహించబడ్డాయి. ఈ మహాసభల్లో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన విద్యాసాగర్ జామి ప్రసాదరావును జాతీయ సమన్వయకర్తగా గుర్తించారు.
ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు. విద్యాసాగర్ జామి ప్రసాదరావు రచించిన పలు గ్రంథాలను సభా వేదికపై ఆవిష్కరించారు.
మహాసభల నిర్వాహకులు, ప్రముఖ సాహితీవేత్తలు ఆయనను శాలువా, మెమెంటో, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు. ఈ గౌరవం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
విద్యాసాగర్ జామి ప్రసాదరావుకు సాహితీవేత్తలు, విద్యావేత్తలు, స్నేహితులు అభినందనలు తెలిపారు.












